మేడ్చల్ నియోజకవర్గాన్ని ఐటీ‌హబ్‌గా మారుస్తా : రేవంత్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేడ్చల్ నియోజకవర్గం

Update: 2023-10-18 09:03 GMT

దిశ, ఘట్కేసర్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేడ్చల్ నియోజకవర్గం ఐటీ హబ్ గా మారుస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రరెడ్డితో పాటు 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ....మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నియోజకవర్గంలో పాటు చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాల్లో పెద్దగా పట్టు ఉందని... సుధీర్ రెడ్డి సేవలు వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీలో గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. సుధీర్ రెడ్డి నాయకుడిగానే కాకుండా తనకి సమీప బంధువు అని అన్నారు.

మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థిగా వజ్రెష్ యాదవ్ అలియాస్ జంగయ్య యాదవ్ను, ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి గెలుపు కోసం సుధీర్ రెడ్డి కృషి చేయాలని కోరారు. 2018లో టిఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన ఎన్నికలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఈసారి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అన్నారు. తనను ఎంపీగా గెలిపించిన మేడ్చల్ నియోజకవర్గం ప్రజలకు, ఓటర్లకు రుణపడి ఉంటానని ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి మల్లారెడ్డి పతనం మొదలైందని అన్నారు. పాలు ,నీళ్లు అమ్మిన అని చెప్పుకుంటున్న మంత్రి సీట్ల అమ్ముకునే నిజం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని సత్తా చాటుకుందామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News