అక్రమ నిర్మాణాల కూల్చివేత
బాచుపల్లి మండలం నిజాంపేట్ విలేజ్ లో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు.
దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి మండలం నిజాంపేట్ విలేజ్ లో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. నిజాంపేట్ తురక చెరువు కట్టపై వెలిసిన అక్రమ షెడ్స్, నిజాంపేట్ సర్వే నెంబర్ 334 లో వెలిసిన గదులు, అక్రమ షెడ్స్ ను కూల్చివేశారు. చెరువులు, కుంటలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్ హెచ్చరించారు.