నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామ్సన్ పెయింటింగ్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-09-07 12:04 GMT

దిశ, ఉప్పల్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామ్సన్ పెయింటింగ్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు గంట నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. 4 అగ్నిమాపక ఫైర్ ఇంజన్ లతో మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. ఇంకా మంటలు అదుపు కాలేదు. గోదాం పక్కనే ఉన్న తిరుమల వుడ్స్ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Similar News