మల్కాజిగిరి ప్రజలకు నిత్యం అండగా ఉంటా : ఈటల
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో
దిశ, అల్వాల్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు నిత్యం అండగా ఉంటానని బీజేపి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం వీబీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ మల్కాజిగిరి లోనే వచ్చిందని గుర్తు చేశారు. ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలు నా సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం నాయకులు ఈటలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, వి.కే మహేష్, భాను ప్రకాష్,మల్లికార్జున్ గౌడ్,రాజిరెడ్డి, మాణిక్య రెడ్డి, మాచర్ల శ్రీనివాస్, వినయ్ కుమార్, కాలనీవాసులు పాల్గొన్నారు.