మోదీ హయాంలో భారత్ రూపురేఖలు మారుతోంది : ఈటల

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం రూపురేఖలు

Update: 2024-05-06 09:20 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం రూపురేఖలు మారుతుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.సోమవారం ఓల్డ్ బోయిన్ పల్లిలోని స్వర్ణధామ నగర్ కాలనీ, యాప్రాలలోని మణి కంఠ కాలనీలో జరిగిన బ్రెక్ ఫాస్ట్ మీటింగ్ లలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 76 ఉన్న విమానాశ్రయాలు 153కి పెరిగాయన్నారు. రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ది చెందుతున్నట్లు తెలిపారు. భారత్ లో పేదలకు 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచినట్లు తెలిపారు. జీఎస్టీ అమలు చేసిన ధీశాలిగా మోదీని అభివర్ణించారు. నిత్యం అధికారం కోసం కాకుండా.. ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి నరేంద్ర మోదీ అని తెలిపారు. ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదని,.ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలన్నారు.500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రామమందిరాన్ని నిర్మించారని తెలిపారు. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11 వ స్థానంలో ఉన్న భారత్ ను 5 వ స్థానానికి తీసుకువచ్చారు. మళ్ళీ అవకాశం ఇస్తే మూడవ స్థానానికి తీసుకువస్తా అని హామీ ఇస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికలను దేశం కోసం, జాతీయత కోణంలో చూడాలని కోరారు. దేశం సుస్థిరంగా ఉండాలి అంటే, మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి అంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు.రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీని జోక్యం చేసుకోవాలని రష్యా లేఖ రాసింది అంటే అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

నేను రాజకీయనాయకుడిని,సేవ చేయడానికి పొలిటికల్ లోకి వచ్చానని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదని తెలిపారు. మీకు నిత్యం అందుబాటులో ఉంటానని,తనను సంపూర్ణంగా ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ముందుగా ఈటల రాజేందర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు సరస్వతి జ్ఠాన మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య(బీఎస్ ఎస్ ఎస్) బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్వర్ణధామ నగర్ కాలనీ ప్రెసిడెంట్ రాఘవేందర్ రావు,బిల్డర్స్ సి.ప్రభాకర్ రావు, రాయల మోహన్ రావు,టి,వి సురేష్, విద్యాసాగర్, గోపాల్,కాలనీ వాసులు రాంలింగారెడ్డి, ఉమ్మారెడ్డి, మల్లారెడ్డి,కొమ్మినేని సీతారాం, వర్ధన్ రావు,అభిలాష్, కన్నా, శివ,రాజేశ్వరి, మాధవి, భవాని, స్వప్న,స్వర్ణ, జనసేన కూకట్ పల్లి ఇన్ ఛార్జ్ ప్రేమ్ కుమార్, బీజేపీ నాయకులు పప్పు పటేల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మణి కాలనీ డివిజన్ ప్రెసిడెంట్ డా. సత్యనారాయణ, ముదిగంటి రవీందర్ రెడ్డి, ప్రసన్న, రాజు, మిలటరీ కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు.


Similar News