పండుగలు ప్రజలలో స్నేహభావాన్ని పెంచుతాయి : సీపీ
పండుగలు ప్రజల్లో స్నేహభావాన్ని పెంచుతాయని,
దిశ,నాగారం: పండుగలు ప్రజల్లో స్నేహభావాన్ని పెంచుతాయని, ప్రశాంత వంతమైన వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. నవరాత్రులను పురస్కరించుకొని సోమవారం నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెరువును సీపీ డీఎస్ చౌహాన్ చైర్మన్ చంద్రారెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. నిమజ్జనోత్సవంలో చెరువు వద్ద అసాంఘిక ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, కీసర సీఐ వెంకటయ్య, ట్రాఫిక్ సీ రవీందర్, ఎస్సై రాజశేఖర్, కౌన్సిలర్ నాగేష్ గౌడ్, లావణ్య శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.