అధికారులే...లీకు వీరులా..?

ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పరోక్షంగా కబ్జాదారులకు సహకరిస్తుండడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.

Update: 2024-12-21 11:39 GMT

దిశ, దుండిగల్ : ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పరోక్షంగా కబ్జాదారులకు సహకరిస్తుండడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండల పరిధిలోని డి.పోచంపల్లి సర్వే నంబర్ 120 లో జోరుగా అక్రమనిర్మాణాలు సాగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. సంబంధిత కబ్జాలపై రెవెన్యూ అధికారులను వివరణ కోరితే కబ్జాదారుల నుండి ఫోన్ కాల్స్ వస్తుండడం రెవెన్యూ అధికారుల తీరుకు అద్దం పడుతుంది.

    దుండిగల్ మండలంలో కాసులకు కక్కుర్తి పడుతున్న రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు లీకు వీరులుగా మారారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను అరికట్టేందుకు 59 జీవో పై ఎటువంటి నిర్మాణాలు చేపట్టారాదని ప్రస్తుత ప్రభుత్వం నుండి ఆదేశాలు స్పష్టంగా ఉన్నా దుండిగల్ మండలంలో 59 జీవో పేరుతో అక్రమనిర్మాణాలు జోరందుకున్నాయి. కాపాడాల్సిన వారే కాటేస్తున్నట్లుంది రెవెన్యూ అధికారుల తీరు. రెవెన్యూ అధికారులను వివరణ కోరిన నిమిషాల్లో కబ్జాదారుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే రెవెన్యూ అధికారుల తీరు ఏపాటిదో ఇట్టే అర్ధమవుతుంది. ఉన్నతాధికారులు నిఘా పెంచి కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని డిమాండ్ వినిపిస్తుంది.

కబ్జాదారులకు అధికారుల పరోక్ష సహకారం

కాపాడాల్సిన వాడే కాటేస్తున్నట్లుంది రెవెన్యూ అధికారుల తీరు. కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడుతూ కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తుండడంతో దుండిగల్ మండల పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సింది పోయి కబ్జాలపై అధికారులను వివరణ కోరితే సంబంధిత అధికారులు కబ్జాదారులకు సమాచారం చేరవేస్తూ లీకువీరులుగా మారారు.

    మండల రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇబ్బడి ముబ్బడుగా అక్రమనిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేతివాటంతో ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయి. సంబంధిత ఆర్ఐ అండతోనే ఇటీవల అక్రమనిర్మాణాలు జోరుగా సాగుతున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.


Similar News