మద్యం మత్తులో మందుబాబులు హల్చల్..
ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు.
దిశ, ఉప్పల్ : ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సీఐ లక్ష్మి మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొంత మంది మందుబాబులు పట్టుబడ్డారు. మా వాహనాలు పట్టుకుంటే మేము ఎలా ఇంటికి వెళ్లాలని ప్రశ్నించారు. మీరే మమ్మల్ని ఇంటికి పంపించండి అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐ లక్ష్మీ మాధవి ఎంత నచ్చచెప్పినా కూడా మందుబాబులు మాత్రం వినలేదు. ఒక గంట సేపటి వరకు వీరంగం సృష్టించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు జోక్యం చేసుకోవడంతో మందుబాబులు తగ్గి ఇంటికి వెళ్లి పోయారు.