బీటెక్ విద్యార్థి అదృశ్యం

యాదగిరిగుట్టకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

Update: 2023-02-27 13:41 GMT

దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: యాదగిరిగుట్టకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్ పల్లి ఎల్బీనగర్ కు చెందిన కెమెడి బీరయ్య కుమారుడు అశోక్ కుమార్(30) 2013లో బీటెక్ పూర్తి చేసి కొద్ది కాలం మార్కెటింగ్ ఏజెంట్ గా విధులు నిర్వర్తించాడు. అనంతరం ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన అశోక్ కుమార్26 న యాదగిరిగుట్టకు వెళ్తుతున్నట్లు ఇంట్లో నుంచి బయలుదేరాడు.

అదే రోజు సాయంత్రం 6 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి తాను గుట్టలో ఉన్నట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 8.30గంటలకు ఇంటికి ఫోన్ చేసి తాను నాగూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడు. తిరిగి అతనికి ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని వారు తెలిపారు. ఆందోళన చెందిన అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు తమకు తెలిసిన వారికి, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరయ్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News