ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు పరిశీలించాలి..
పేద ప్రజలు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించాక పలు కారణాలతో తిరస్కరించిన తర్వాత చెల్లించిన రుసుములో 10% కోత విధించి ఇవ్వడం సరికాదని భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ పట్టణ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అన్నారు.

దిశ, ఘట్కేసర్ : పేద ప్రజలు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించాక పలు కారణాలతో తిరస్కరించిన తర్వాత చెల్లించిన రుసుములో 10% కోత విధించి ఇవ్వడం సరికాదని భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ పట్టణ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించే ముందు భూమి పత్రాలను సరిగా చూసుకోవాలని, ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులు సంప్రదించి ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ఎల్ఆర్ఎస్ పథకం పై అధికారులు శ్రద్ద వహించి సజావుగా ప్రక్రియను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, విరివిగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, అనిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.