మందుబాబులకు కేరాఫ్ అడ్రస్.. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్
అప్పటి మాజీ సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లి మండలంలోని
దిశ,శామీర్ పేట్ : అప్పటి మాజీ సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం, నాగిశెట్టి పల్లి, లక్ష్మాపూర్ , మూడు చింతలపల్లి, లింగాపూర్ తండా, గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి విధితమే ఆ తర్వాత ఆయా గ్రామాల అభివృద్ధి కోసం 66 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ ,వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
సీఎం ఆదేశాలతో..
అప్పటి మాజీ సీఎం ఆదేశాలతో అధికారులు సైతం పర్యవేక్షించారు. కాంట్రాక్టర్లు ఆగా మేఘలమీద పనులు పూర్తి చేశారు. పనులు మాత్రం పూర్తి చేశారు కానీ ప్రారంభోత్సవానికి మాత్రం కొద్ది కాలం వరకు నోచుకోలేదు 2022 ఎన్నికల కోడ్ వస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి హడావుడిగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభోత్సవం చేశారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో...
మూడు చింతలపల్లి మండల కేంద్రంలో నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వచ్చిన వసతులు కరువవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. గ్రామాలకు దూరంగా ఈ భవనాలు నిర్మించడంతో తాగుబోతులకు మంచి అడ్డాగా మారింది. ఫంక్షన్ హాల్ లో నిర్మించిన విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ వైర్లు పూర్తిగా ధ్వంసం చేశారు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన నిర్మాణంలో ఎటు చూసినా గాజు పెంకులు, బీరు సీసాలు కాల్చి పడేసిన బీడీలు, సిగరెట్లు , గుట్కా ప్యాకెట్లు కనిపిస్తున్నాయి .అటవీ ప్రాంతం కావడంతో గంజాయి సైతం పిలుస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.