బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి ఇల్లు గుల్ల
గచ్చిబౌలి లోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి 4 లక్షల విలువైన ఆభరణాలు అపహరించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, మేడిపల్లి: గచ్చిబౌలి లోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి 4 లక్షల విలువైన ఆభరణాలు అపహరించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రాజలింగం కాలనీ ఫేస్ 2 లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసే శ్రీరామ్ శివానంద్ తన కుటుంబం తో నివాసం ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఈ నెల 12 తేదీన కుటుంబ సభ్యులతో కలిసి గచ్చిబౌలి లో నివాసం ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. తిరిగి సోమవారం తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళం పగలగొట్ట ఉండగా, లోపలికి వెళ్లి చూసే సరికి కబోర్డ్ లో ఉన్న సుమారు 4 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు తెలుసుకుని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.