నిజాంపేట్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వెలిసిన పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వెలిసిన పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ ఆదేశాల మేరకు సర్వే నంబర్ 149లోని హోటల్ గ్రీన్ బావర్చి వెనుక గల అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ టీం కూల్చివేసింది. రోడ్డును ఆక్రమిస్తూ పరిమితులకు మించి అదనపు అంతస్తులు వేశారనే ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా ప్రగతినగర్ కమాన్ సమీపంలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన అక్రమ షెటర్స్ ను అధికారులు తొలగించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం -2019 ప్రకారం కాకుండా చట్ట వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.