ప్రొటోకాల్ వివాదం.. ఎమ్మెల్యే వైఖరీపై కార్పొరేటర్ కన్నీరు!
ఉప్పల్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ లోల్లి గందగోళంగా మారింది.
దిశ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ లోల్లి గందగోళంగా మారింది. కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి మధ్య నెలకొన్న వివాదం ముదురుతుందనే ఉంది. గతంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి డివిజన్ లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో తనకేలాంటి ప్రాధాన్యత కల్పించడం లేదని బహిరంగానే ఎమ్మెల్యే తీరును వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఇద్దరి మద్య వర్గపోరు రగులుతూనే ఉంది.
తాజాగా సోమవారం కుషాయిగూడలో రూ. 54 లక్షల వ్యయంతో చేపట్టినమాడల్ దోబీఘాట్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర కార్మిక ఉపాధిశాఖ మంత్రి ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే ఇక్కడి ప్రారంభోత్సవ విషయంలో తనకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా దోబీఘాట్ ను ఏలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పైగా గత కొంత కాలంగా డివిజన్‌లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో తనకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని పైగా తనను కించపర్చే విధంగా వ్యవహరిస్తూ తన కులాన్ని కింకచరిచే విధంగా గొల్లది అంటూ అవవానిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. బీసీ మహిళనైన తనను గొల్లెక్కిరిది అంటూ భూతులు తిడుతున్నాడని కంట తడి పెట్టుకుంటూ ఏమ్మెల్యే వైఖరిపై నిప్పులు చేరిగింది. బీసీల ఓట్లు లేకుండానే ఏమ్మెల్యేగా గెలిచారా అంటూ ప్రశ్నించింది.
పది వేల రూపాయలు ఇచ్చి రౌడీలు, గుండాలతో చంపిస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. స్థానిక కార్పొరేటర్‌గా తాను లేకుండా దోబీ ఘాట్ ను ఏలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. బీసీ మహిళా కార్పొరేటర్ అయిన తనకు మర్యాద లేకుండా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి దూషిస్తున్నారని, దానికేంటీ చెప్పేది అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని విలపించారు. నియోజకవర్గంలోని ప్రతీ కాలనీలో ఎమ్మెల్యే గ్రూపు రాజకీయాలు చేస్తూ, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇతర మహిళలతో తన గురించి కించపర్చేలా వ్యవహరిస్తూ , భూతులు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తన శైలిని మార్చుకోకపోతే సహించేది లేదని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హెచ్చరించారు. గొల్లది, ఏమీ చేస్తుందనీ, తనపై నాన్ లోకల్ అని ముద్ర వేసి అవమానపరుస్తున్నా ఇప్పటి వరకు భరిస్తూ వచ్చాననీ ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో అవలంబిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, తనపై నిత్యం అసత్య ఆరోపణలు చేస్తూ, తనను అవమానిస్తున్న విషయాన్ని పార్టీ అదిష్ఠానం దృష్టికి తీసుకెళ్తతానంది.