సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా ఎస్టీయూ (టీఎస్) జిల్లా అధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-12 13:37 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా ఎస్టీయూ (టీఎస్) జిల్లా అధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి అన్నారు. మూడు రోజులుగా మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ముందు చేపడుతున్న ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని గురువారం వారు ఎస్టీయూ రాష్ట్ర సహధ్యక్షులు ప్రేమ్ కుమార్, జిల్లా సహాధ్యక్షులు యు.విఠల్ తో సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

    ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సమగ్ర శిక్ష విభాగం ఉద్యోగుల పోస్టులను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు ప్రకటించారు.


Similar News