ఘట్కేసర్ సహకార బ్యాంక్ చైర్మన్​కు కాంగ్రెస్ అధిష్టానం చివాట్లు

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామంటూ ఘట్కేసర్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇన్​చార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు.

Update: 2024-12-12 09:56 GMT

దిశ, ఘట్కేసర్ : కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామంటూ ఘట్కేసర్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇన్​చార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు. ఘట్కేసర్ పట్టణంలో బ్రిడ్జి నిర్మాణం విషయంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీకి రామ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో నిరాహార దీక్ష శిబిరానికి వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి వస్తున్నారని రామ్ రెడ్డి ప్రచారం చేశారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయే వారికి నష్టపరిహారం ఇప్పించే విషయంలో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడతానని ప్రకటించారు.

    చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష శిబిరానికి రాకపోవడంతో రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడటానికి అంబేద్కర్ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లాడు. కార్యాలయంలో ఉన్న మాజీ సర్పంచ్ యాదిరి యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు ముత్యాలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్ రామిరెడ్డి పై విరుచుకుపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ తొత్తువా అంటూ చివాట్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలపకుండా రిలే నిరాహార దీక్షకు ఎలా సంఘీభావం తెలుపుతారని ప్రశ్నించారు.

     ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తావా అంటూ మందలించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇంతకాలం ఘట్కేసర్లో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడానికి కారణం నువ్వేనని సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేనిపోని రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టొద్దని సూచించారు. 


Similar News