సీఎం సార్.. మా ప్రాణాలు కాపాడండి
పొల్యూషన్ తో ప్రజలు మరణిస్తున్నారని, సీఎం సార్ మా కాలనీ ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, కుత్బుల్లాపూర్ : పొల్యూషన్ తో ప్రజలు మరణిస్తున్నారని, సీఎం సార్ మా కాలనీ ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ లోని బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీ సమీపంలో గల టీఎఫ్ఎల్ కెమికల్ కంపెనీ వల్ల ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కాలనీ వాసులు శనివారం పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సనత్ నగర్ లోని పీసీబీ కార్యాలయంలో సెక్రటరీ రఘును కలిసి తమ ఫిర్యాదు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత కొంత కాలంగా సాయి అనురాగ్ కాలనీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రమై చిన్నారులు, వృద్దులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. ఎయిర్, వాటర్ పొల్యూషన్ బారిన పడి మృతి చెందారని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పొల్యూషన్ కు కారణం అయిన టీ ఎఫ్ ఎల్ కంపెనీపై చర్యలు ఉండాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో కస్తూరిరాజ్ కుమార్, హన్మంత్ రావు తో పాటు సాయి అనురాగ్ కాలనీ వాసులు ఉన్నారు.