గద్దర్ బిడ్డను నన్ను ఆశీర్వదించండి..
కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజానౌక, ప్రజా గాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు, గద్దర్ అభిమానులు, కళాకారులు శనివారం వెన్నెల ఇంటికి చేరుకొని కృతజ్ఞతలు తెలియజేశారు.
దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజానౌక, ప్రజా గాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు, గద్దర్ అభిమానులు, కళాకారులు శనివారం వెన్నెల ఇంటికి చేరుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెన్నెల మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన సోనియా, రాహుల్ గాంధీ, రేవంత్, భట్టి, మధు యాష్కీ, కేంద్ర నాయకులకు, రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులను, యువతను కలిసి త్వరలోనే ప్రచారం చేపడతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని, గద్దర్ బిడ్డ గా ముందుకెళ్తానని, నాన్న ఆశయాలు, సిద్ధాంతాల వల్లే భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.