11 మంది టీచర్లపై చర్యలు

స్పౌజ్ కేటగిరిలో అవకతవకలకు పాల్పడిన ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నట్లు మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా విద్యా అధికారి విజయకుమారి గురువారం పేర్కొన్నారు.

Update: 2024-11-21 13:40 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : స్పౌజ్ కేటగిరిలో అవకతవకలకు పాల్పడిన ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నట్లు మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా విద్యా అధికారి విజయకుమారి గురువారం పేర్కొన్నారు. ఉపాధ్యాయ స్పౌజ్ కేటగిరిలో వెబ్ కౌన్సెలింగ్ లో 11 మంది టీచర్లు నిబంధనలకు విరుద్ధంగా ఆప్షన్లు ఎంపిక చేసినట్లు తెలిపారు.

    వారి స్పౌజ్ కు సమీపంలో గల ఖాళీ పోస్టులను ఎంచుకోకుండా వారికి అనుకూలంగా ఇతర ప్రాంతాలలో ఖాళీ పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా ఆప్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని, దీంతో విచారణ జరిపి 11 మంది ఉపాధ్యాయులకు క్రమ శిక్షణలో భాగంగా చార్జ్ మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే వీరిలో ఇద్దరు ఉపాధ్యాయులు హై కోర్టును అశ్రయించి స్టే ఉత్తర్వులు తెచ్చారని, దీనిపై హై కోర్టు స్టే ఎత్తి వేసేందుకు జిల్లా విద్యాశాఖ నుంచి వెకెట్ పిటిషన్ సమర్పించినట్లు తెలిపారు. తదుపరి హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి స్పాజ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ విజయకుమారి తెలిపారు.


Similar News