బాధితులను పరమర్శించిన వజ్రెష్ యాదవ్..
బోడుప్పల్ ఆకృతి టౌన్ షిప్ లో వరుస లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ యాజమాన్యం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు.
దిశ, మేడిపల్లి : బోడుప్పల్ ఆకృతి టౌన్ షిప్ లో వరుస లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ యాజమాన్యం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఓ ప్రయివేట్ కార్యక్రమానికి హాజరైన బోడుప్పల్ మేయర్ మొదటి ఫ్లోర్ నుండి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు కూలిపోవడంతో పలువురు కాంగ్రెస్ నాయకులకు గాయలు అయ్యాయి. కాగా మాయార్ అజయ్ ప్రమాదం నుండి స్వల్ప గాయలతో బయటపడ్డారు. దీంతో బోడుప్పల్ కమిషనర్ రామలింగం సోమవారం అకృతి టౌన్ షిప్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. అకృతి టౌన్ షిప్ కు రెసిడెన్స్ అనుమతులు తీసుకుని కమర్శియల్ నడిపిస్తున్నారని, ఇంత పెద్ద బిల్డింగ్ కు ఒకే లిఫ్ట్ ఉందని ఇప్పటికే పలు మార్లు ఈ లిఫ్ట్ లో ఇలానే ప్రమాదం జరిగిందనైనా యాజమాన్యం జాగ్రత్తలు పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ పలువురు కాంగ్రెస్ నాయకులను టీపీసీసీ ఉపాధ్యాక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ పరామర్శించారు.
అకృతి టౌన్ షిప్ పై ఏవిధమైన చర్యలు తీసుకుంటారో వేచి చుడాలి.. బోడుప్పల్ కమిషనర్ రామలింగం వివరణ.. బోడుప్పల్ లో ఆదివారం లిఫ్ట్ కూలి మేయర్ తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులకు గాయాలు అయ్యాయని, జరిగిన ప్రమాదం పై ఆకృతి టౌన్ షిప్ సందర్శించి యాజమన్యానికి నోటీసులు అందజేశామని, ప్రమాదానికి కారణమైన లిఫ్ట్ ని నిలిపివేశామని అన్నారు. అకృతి టౌన్ షిప్ కు ఏవేమి అనుమతులు ఉన్నాయో విచారణ చేస్తున్నామని త్వరలోనే పూర్తి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రామలింగం తెలియజేశారు.