విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు పతకాలు..

Update: 2023-05-09 16:41 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 281మంది అధికారులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రకటించిన పతకాలను నేడు గ్రహీతలకు అంద చేయనున్నారు. రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్​అలీ, డీజీపీ అంజనీ కుమార్​ఈ పతకాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా రాష్ర్ట ప్రభుత్వం కూడా విధుల నిర్వర్తనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కొన్నేళ్లుగా పతకాలు, అవార్డులు అందచేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అతి ఉత్కృష్ట సేవా పతకాలు 30 మంది పోలీసు అధికారులకు ఇవ్వనున్నారు.

అదేవిధంగా ఉత్కృష్ట పతకాలు 28, అసాధరణ అసూచన కుశలతత పథకాలను 7గురికి ప్రదానం చేస్తారు. పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను కేంద్ర హోంమంత్రి పతకాలు 11మందికి, శౌర్య పతకాలు 11మందికి, మహోన్నత సేవా పతకాలు 7గురికి అందచేయనున్నారు. ఇక, రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఉత్తమ సేవా పతకాలు 84మందికి, ఆంత్రిక్​సురక్షా సేవా పతకాలు 67మందికి, ఆంత్రిక్​సురక్షా సేవా పతకాలను 28మంది పోలీసు అధికారులకు ఇవ్వనున్నారు.

పతకాలను అందుకోనున్న వారిలో డీజీపీ అంజనీ కుమార్​తోపాటు ఇద్దరు అదనపు డీజీలు, ఇద్దరు ఐజీలు, ఓ డీఐజీ, ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు అయిదుగురు, డీఎస్పీలు ఇరవై రెండు మంది ఉన్నారు. వీరితోపాటు 39మంది ఇన్స్​పెక్టర్లు, యాభై ఏడుమంది సబ్​ఇన్స్​పెక్టర్లు, ముప్పయి ఒక్కమంది ఏఎస్సైలు, ఇరవై రెండు మంది హెడ్​కానిస్టేబుళ్లు, తొంభై ఆరుమంది కానిస్టేబుళ్లు కూడా పతకాలు అందుకోనున్నారు.

Tags:    

Similar News