యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : గజ్వేల్ ఏసీపీ రమేష్
గ్రామీణ ప్రాంత యువకులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గజ్వేల్ ఏసీపీ రమేష్ అన్నారు.
దిశ, జగదేవపూర్ : గ్రామీణ ప్రాంత యువకులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గజ్వేల్ ఏసీపీ రమేష్ అన్నారు. సోమవారం జగదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ ఆన్ లైన్ మోసాలు, సోషల్ మీడియా వల్ల జరుగే నష్టాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మైన డ్రైవింగ్, సమాజంలో జరుగుతున్న నేరాలు నుంచి ఎలా రక్షణ పొందాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రమోహన్, స్కూల్ హెచ్ఎం విజయ్ కుమార్, గజ్వేల్ షీ టీం ఏఎస్ఐ అమృత్, హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, కానిస్టేబుల్ యుగంధర్, అన్వేష్, జ్యోతి, తదితరులు ఉన్నారు.