'డ్రగ్స్ నిర్మూలనకు యువత ముందుకు రావాలి'
విద్యాభ్యాసం అనంతరం మంచి భవిష్యత్తుతో ముందుకు సాగాల్సిన యువత డ్రగ్స్ వంటి మహమ్మారికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ పుష్పన్ కుమార్ అన్నారు.
దిశ, సంగారెడ్డి అర్బన్ : విద్యాభ్యాసం అనంతరం మంచి భవిష్యత్తుతో ముందుకు సాగాల్సిన యువత డ్రగ్స్ వంటి మహమ్మారికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ పుష్పన్ కుమార్ అన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఇష్ట జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, సైబర్ క్రైమ్ అంశాల పై విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ వంటి మహమ్మారిని నిర్మూలించడంలో యువత తమ వంతు పాత్రను పోషించి చేయూతనందించాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రస్తుతం సైబర్ క్రైమ్ రేటు ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాటి పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తమ వ్యక్తిగత సమాచారం బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ మెసేజ్లను అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని తెలిపారు. ఫోన్లకు వచ్చే అనవసరమైన లింకులను ఓపెన్ చేసి సైబర్ క్రైమ్ కు గురి కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ సీఐ భాస్కర్, ఎస్సై రామనాయక్, కాలేజీ విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.