సమిష్టి కృషితోనే పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి జాతీయ అవార్డు : ఎమ్మెల్యే

ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెందిన పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రంలోని టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఉత్తమ సేవలు విభాగంలో జాతీయ స్థాయిలో

Update: 2024-11-29 14:18 GMT

దిశ, పటాన్ చెరు : ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెందిన పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రంలోని టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఉత్తమ సేవలు విభాగంలో జాతీయ స్థాయిలో ఏడవ స్థాయి అవార్డు రావడం సమిష్టి కృషి మూలంగానే సాధ్యమైందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సెంట్రల్ క్వాలిటీ సూపర్వైజర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సమీక్షలో మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 7వ స్థానం సాధించిన సందర్భంగా.. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అవార్డు రావడానికి కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 20 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో. ఏరియా ఆసుపత్రికి జీవోని మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. 2012లో ఆసుపత్రి ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజలందరి మనల్ని పొందుతుందని తెలిపారు. గత దశాబ్ది కాలంలో ఆసుపత్రికి అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లు, ఆపరేషన్ థియేటర్లు, జనరేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సిఎస్సార్ నిధులతో వివిధ సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో ఏడవ స్థానం దక్కడం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి గర్వకారణమని గూడెం అన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని అవార్డులు సాధించాలని అభిలాషించారు. ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకార అందిస్తున్నామని తెలిపారు.

రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో పటాన్ చెరు లో చేపడుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అతి త్వరలో ఆసుపత్రిని ప్రారంభించేందుకు సలహాలు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవ అందిస్తున్న పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా వైద్యాధికారి గాయత్రీ, డిసిహెచ్ఎస్ అధికారి సంగారెడ్డి, మాజీ జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, విజయభాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, ఎంపీడీవో యాదగిరి, ఎమ్మార్వో రంగారావు, కంకర సీనయ్య, బల్దియా డిప్యూటీ కమిషనర్ సురేష్, ఆస్పత్రి సూపరిండెంట్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఎంవో ప్రవీణ, ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ వసుందర, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహ రెడ్డి, అఫ్జల్, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News