ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేట్ లో శుక్రవారం చోటు చేసుకుంది.
దిశ, శివంపేట : ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేట్ లో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుని తల్లిదండ్రులు అయినా చుక్క కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేటకు చెందిన చుక్క స్వామి ప్రదీప్ (18) అనే విద్యార్థి తమ బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. తూప్రాన్ లోని చైతన్య జూనియర్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడని, గత మూడు సంవత్సరాల క్రితం సైకిల్ పై నుండి పడటంతో తలకు తీవ్ర గాయం అయిందని తలలో రక్తం గడ్డ కట్టడంతో అప్పటి నుంచి అతనికి మానసికంగా స్థితి బాగా లేదని తెలిపారు. మృతుని తండ్రి చుక్క కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు .