యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : సంగారెడ్డి ఎస్పీ

రౌడీలు, కేడిలు, సస్పెక్ట్ లు సత్ప్రవర్తన కలిగి చేసిన తప్పులు

Update: 2024-10-18 13:27 GMT

దిశ, సంగారెడ్డి /మునిపల్లి : రౌడీలు, కేడిలు, సస్పెక్ట్ లు సత్ప్రవర్తన కలిగి చేసిన తప్పులు తిరిగి చేయకుండా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మునిపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అనంతరం రాత్రి 10 గంటలకు మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల ఇండ్ల వద్దకు నేరుగా వెళ్లి తనిఖీ చేశారు. వారితో మాట్లాడుతూ ప్రస్తుతం వారి జీవన విధానం, వారు చేస్తున్న పని/ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో చేసిన తప్పులను తిరిగి పునరావృతం చేయకుండా సత్ప్రవర్తన కలిగి సాధారణ జీవన విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు. సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే హిస్టరీ షీట్లను తీసివేయడం జరుగుతుందన్నారు. అనంతరం మునిపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ యువతతో మాట్లాడారు.

యువత చెడు వ్యసనాలను అలవాటు చేసుకోవద్దని, విద్యావంతులు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. చదువు పూర్తయిన అనంతరం జాబ్ ట్రయల్స్ చేస్తూ, కలిసి చదువుకొని, ఉద్యోగం సాధించి ఆదర్శంగా ఉండాలని అన్నారు. గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు సహకరించాలని సూచించారు. గంజాయి, నిషేదిత ఇతర మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, గ్రామ రక్షణ, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ విలేజ్ విజిటింగ్ లో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య మరియు మునిపల్లి ఎస్ఐ ఉన్నారు.


Similar News