ఆరు నెలల్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..

ఆరు నెలల్లోనే ఓ యువకుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

Update: 2024-11-16 04:04 GMT

దిశ, నిజాంపేట : ఆరు నెలల్లోనే ఓ యువకుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన మద్ది రాజాసాబ్ మూడో కుమారుడు మద్ది శరత్ కుమార్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దె పరీక్షలకు సంసిద్ధమై 6 నెలల్లోనే 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కాగా గురువారం ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ - 4 ఫలితాల్లో పంచాయతీరాజ్ విభాగం లో సెలెక్ట్ అయ్యారు. దీంతో గ్రామస్తులు శరత్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో కృషి చేస్తే విజయాన్ని సాధించొచ్చన్నారు.

Tags:    

Similar News