రోడ్డు పై విద్యార్థుల రాస్తారోకో..

పాఠశాల సమయానికి బస్సులు రావడం లేదని నిరసిస్తూ విద్యార్థులు ఖాజాపూర్- రామాయంపేట రహదారి పై రాస్తారోకో చేపట్టారు.

Update: 2024-09-25 09:57 GMT

దిశ, చిన్నశంకరంపేట : పాఠశాల సమయానికి బస్సులు రావడం లేదని నిరసిస్తూ విద్యార్థులు ఖాజాపూర్- రామాయంపేట రహదారి పై రాస్తారోకో చేపట్టారు. రామాయంపేట నుండి చిన్న శంకరంపేట మండలం వరకు వేసిన బస్సులు రాకపోవడంతో ఒక పీరియడ్ నష్టపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, ఇతర పాఠశాలకు గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థినీ విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు.

ఈ రోడ్డు నుంచి వచ్చే బస్సులు పాఠశాల సమయానికి రాకపోవడంతో పాఠాలు నష్టపోతున్నామని ఖాజాపూర్, చెన్నై పల్లి, వెంకట్రావుపల్లి,మడూ ర్, సంగయ్యపల్లి, విద్యార్థులు ఆరోపించారు. బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో బడికి వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పొందాల డిపో మేనేజర్ తో మాట్లాడారు. డిపో మేనేజర్ నేటి నుంచి బస్సులు నడుస్తాయని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.


Similar News