రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ అభివృద్దికి కృషి : ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపాలిటీల
దిశ,గండిపేట్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి చొరవతో పని చేయడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. గురువారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన మున్సిపల్ భవనంను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రూ.12 కోట్లతో మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. భవనం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్‌గౌడ్, సాగర్‌గౌడ్, సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.