పార్టీలో నూతన ఉత్సాహంతో పని చేయండి : హరీష్ రావు

పార్టీలో నూతన ఉత్సాహంతో పనిచే పనిచేయాలని మాజీ మంత్రి,

Update: 2024-10-24 12:27 GMT

దిశ, గుమ్మడిదల: పార్టీలో నూతన ఉత్సాహంతో పనిచే పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గుమ్మడిదల మండలం నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు గురువారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కష్టాలను చూసిందని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం ఇతర పార్టీలోకి వెళ్లే నాయకుల కారణంగా పార్టీకి నష్టమేమీ లేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ కేసిఆర్ అడుగుజాడల్లో కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు.

నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. నూతన ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్ కొత్తపల్లి మల్లేష్ గౌడ్, నరహరి, నక్క వెంకటేష్ గౌడ్, సంతోష్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు, తుపాకుల రాజు, మురళి, రుక్మారెడ్డి, దోమడుగు శంకర్, వెంకటేష్, శ్రీనివాస్, పద్మా రెడ్డి, సత్యనారాయణ, ఆంజనేయులు యాదవ్ ,యాదగిరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News