వరదనీటి సమస్యను పరిష్కరిస్తాం

వరదనీటి సమస్యను పరిష్కరిస్తాం అని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

Update: 2024-09-02 10:02 GMT

దిశ,పటాన్ చెరు : వరదనీటి సమస్యను పరిష్కరిస్తాం అని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ఉన్న ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల నుండి వస్తున్న వరద నీరుతో చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సోమవారం ఉదయం స్థానిక నాయకులు, గ్రామపంచాయతీ ఈఓ కవితతో కలిసి రాధమ్మ కాలనీ, నాగార్జున కాలనీ, పార్థసారథి కాలనీలలో పర్యటించి ముంపు వల్ల కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

    రోడ్లపై భారీగా నిలిచిన నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరిస్తామన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షానికి రోడ్లు, కాలనీలలో భారీగా వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వరదనీటి సమస్యపై అప్రమత్తంగా ఉండి పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ముంపు సమస్యను తీర్చాలని కోరారు. 

Tags:    

Similar News