అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. వడగళ్ల వానతో దెబ్బతిన్న వరి పంటను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి బుధవారం పరిశీలించారు.

Update: 2023-04-26 12:11 GMT

దిశ, మెదక్ టౌన్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. వడగళ్ల వానతో దెబ్బతిన్న వరి పంటను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి బుధవారం పరిశీలించారు. హవేలీ ఘనాపూర్ మండలం కూచన్ పల్లిలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి బాధిత రైతులను ఆమె ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి భరోసానిచ్చారు. పంట కోసే సమయానికి అకాల వర్షం వలన పంట నష్టం జరిగిందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అందరిని ఆదుకుంటుందన్నారు.

మెదక్ నియోజకవర్గంలో సాయంత్రం వరకు పంట నష్టంపై నివేదికను రూపొందించి సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. తక్షణ సహాయం కింద సీఎం కేసీఆర్ రైతులకు పంట నష్ట పరిహారం అందజేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మెదక్ ఆర్డీవో సాయిరాం, ఎమ్మార్వో నవీన్ కుమార్, కుచన్ పల్లి సర్పంచ్ దేవాగౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు సోములు, హవేళి ఘనాపూర్ పార్టీ అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజగౌడ్, ఫరీద్ పుర్ ఎంపీటీసీ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిలు, తొగిట సర్పంచ్ శ్రీహరి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News