చదువుల వరదాయినిగా వన దుర్గమ్మ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల
దిశ, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడవ రోజైన బుధవారం సప్తమి పురస్కరించుకొని వనదుర్గామాతను చదువుల వరదాయిని(సరస్వతీ దేవి)గా, తెలుపు రంగు చీర, వీణతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు శంకరశర్మ, పార్థివ శర్మ తదితరులు వేకువజామునే మూలవిరాట్, రాజగోపురంలో ప్రతిష్టించిన అమ్మవారి ఉత్సవ విగ్రహం, గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, అర్చనలు నిర్వహించి తెలుపు రంగు వస్త్రం, వివిధ రకాల పుష్పాలు, వీణతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.