prajavani : ప్రభుత్వ భూమిని కాపాడాలి.. ప్రజావాణిలో యువత అర్జీ..

అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ లోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఈ భూమిని కాపాడాలని గడి పెద్దాపూర్ గ్రామ యువత సోమవారం నాడు తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు.

Update: 2024-10-29 05:23 GMT

దిశ, అల్లాదుర్గం : అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ లోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని, ఈ భూమిని కాపాడాలని గడి పెద్దాపూర్ గ్రామ యువత సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. 863/1/1 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని, ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు, గ్రామ యువతకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ స్థలం నేడు కొందరు పలుకుబడి కలిగిన వారు కబ్జా చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.

ఈ భూమిని ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉపయోగించుకుంటే ఎంతో బాగుంటుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ స్థలాన్ని పాఠశాల విద్యార్థులకు, గ్రామ యువతకు సౌకర్యంగా క్రీడా మైదానానికి విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకోవాలని గ్రామ యువత కోరారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని ఆ భూమి చుట్టూరా రాతి కడ్డీలు వేయించి ప్రభుత్వ స్థలమని బోర్డు వేయించాలని ఆ గ్రామ యువత, తహశీల్దార్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.

Tags:    

Similar News