వైభవంగా ముగిసిన తిరుమల స్వామి జాతర

స్వయంభుగా వెలిసిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి.

Update: 2024-02-18 09:25 GMT

దిశ, నిజాంపేట : స్వయంభుగా వెలిసిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులో గల తిరుమల బండపై స్వయంబుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు స్వామివారి విగ్రహాలకు నిత్య హోమం, పూర్ణాహుతి, శతకటాభిషేకం, చక్రస్నానం స్వామివారి పవిత్రమైన గుండంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వెంకట రామ్మోహన్ శర్మ, అర్చకులు సంతోష్ శర్మ, సభ్యులు ముత్యం రెడ్డి అక్కల రాములు పాల్గొన్నారు. 


Similar News