Debt waiver celebrations : రైతు సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం

రైతుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

Update: 2024-07-18 14:04 GMT

దిశ, గుమ్మడిదల : రైతుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసిన సందర్భంగా గురువారం జిన్నారం మండలం సొలక్ పల్లి గ్రామ పరిధిలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రుణమాఫీ పొందిన రైతులకు మిఠాయిలు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ..

    రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి అనుగుణంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 31 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. ఆగస్టు నెలాఖరులోపు రెండు లక్షల రూపాయల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అంశాన్ని గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. మొదటి విడతలో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు క్లస్టర్ల పరిధిలోని 2843 మంది రైతులకు లక్ష రూపాయల రుణాలు

    మాఫీ చేసినట్టు చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ అనంతరం తిరిగి రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి రైతు ఇంట సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు, గాలి అనిల్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, మండల మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, మాజీ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News