ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు.
దిశ, మెదక్ టౌన్: ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం తపస్ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నవాత్ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల అనేక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లుగా వాటిని నెరవేర్చాలని అన్నారు. జీవో 317 ద్వారా అన్యాయం గురైన బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, ఆశ్రమ పాఠశాలలో వార్డెన్లు, ఏఎన్ఎంలను నియమించాలని అన్నారు. కేజీబీవీ ఉద్యోగులకు మినిమం పే స్కేల్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని అన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. 2017 టీఆర్టీ ఉపాధ్యాయులకు గత పీఆర్సీలో జరిగిన నష్టాన్ని కొత్త పీఆర్సీ పూరించాలని, అన్ని రకాల రాష్ట్ర పాఠశాలలకు ఒకే సమయ పాలన ఉండాలి, నిలిచిపోయిన పదోన్నతులను బదిలీలను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, తపస్ జిల్లా, మండల బాధ్యులు చక్రవర్తి, రాజేశ్వర్, జ్ఞానేశ్వర్, శ్రీకాంత్ రెడ్డి, సిద్దు, నరేందర్, సంతోష్ , ప్రవీణ్, శేఖర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.