మందుబాబులకు అడ్డాగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణ..

నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ

Update: 2024-10-23 08:57 GMT

దిశ,నర్సాపూర్ : నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణ మద్యం ప్రియులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు రాత్రి అయ్యిందంటే చాలు మద్యం ప్రియులు ఎంచక్కా ప్రభుత్వ కార్యాలయం ఆవరణ ఎంచుకొని జర్నలిస్టులు కూర్చోవడం కోసం వేసుకున్న బెంచి పైన కూర్చొని మందు తాగుతున్నారు. ఈ తతంగం ప్రతిరోజు రాత్రి జరుగుతుండడంతో ఆ ప్రాంతమంతా ఖాళీ అయినా క్వార్టర్ ఆఫ్ ఫుల్ బాటిలతోపాటు కాళీ గ్లాసులు వాటర్ బాటిల్లతో కళకళలాడుతుంది. ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో మద్యం తాగుతున్నట్టు అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు.

స్వామి వివేకానందుడి సాక్షిగా..

ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో స్వామి వివేకానందుడి విగ్రహం ఉంది. స్వామి వివేకానంద సాక్షిగా ప్రతిరోజు మందు ప్రియులు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మద్యం తాగిన తర్వాత మద్యం మత్తులో కాళీ బాటిళ్లను వివేకానందుడి విగ్రహం పక్కన పగలగొట్టి ఆనందం పొందుతున్నారు.

సర్వసభ్య సమావేశంలో ఫిర్యాదు..

నర్సాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగిన సమయంలో అప్పటి కొంతమంది సభ్యులు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. కార్యాలయం ఆవరణలో లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఎంపీడీవో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సభ్యులకు హామీ ఇచ్చిన ఇప్పటివరకు లైట్లు గాని సీసీ కెమెరాలు గాని ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మద్యం తాగుతున్న వారిపై చర్యలు తీసుకొని సీసీ కెమెరాలు లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.


Similar News