యువకుడు మృతితో కలిదిన యంత్రాంగం
డెంగ్యూ జ్వరంతో ఓ యువకుడు బుధవారం సాయంత్రం మృతి చెందిన విషయం విధితమే.
దిశ, చిన్నశంకరంపేట : డెంగ్యూ జ్వరంతో ఓ యువకుడు బుధవారం సాయంత్రం మృతి చెందిన విషయం విధితమే. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి సాయి సింధు అప్రమతమై గురువారం మండల పరిధి శాలిపేట గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మలేరియా అధికారి విజయేందర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో డ్రైనేజీలు, వీధుల గుండా ఇండ్లలో చుట్టుముట్టు దోమల మందు పిచికారీ చేయించారు. అనంతరం మలేరియా అధికారి విజయేందర్, డాక్టర్ సాయి సింధు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా
ఉంచుకోవాలని, ఇంటి ముందు నీటి గుంతల్లో నీరు నిల్వ చేసుకోరాదని, పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. డ్రమ్ములు, కూలర్లలో దోమలు దాకుంటాయని, వాటిని బయటకు తీయాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి జలం సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఎంపీఓ గిరిజారాణి, మాజీ తాజాఎంపీపీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ పోచయ్య, సీహెచ్ఓ యాదగిరిరావు, ఏఎన్ఎంలు మాలతి, స్వప్న, ప్రియాంక, గ్రామ సెక్రెటరీ తదితరులు ఉన్నారు.