శిశువును అమ్మకానికి పెట్టిన మహిళ... అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు

శిశువును అమ్మకానికి పెట్టిన ఘటన మండల పరిధిలోని ఇందుప్రియాల్ లో చోటు చేసుకుంది.

Update: 2024-10-21 14:16 GMT

దిశ,దౌల్తాబాద్: శిశువును అమ్మకానికి పెట్టిన ఘటన మండల పరిధిలోని ఇందుప్రియాల్ లో చోటు చేసుకుంది. మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన 20 రోజుల శిశువును అమ్మకానికి పెట్టింది. గజ్వేల్ మార్కెట్ యార్డు నుంచి అమ్మకం కోసం ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్ పై ఇందుప్రియాల్ అటవీ సమీపానికి వచ్చింది. శిశువు కొనుగోలు ధర విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో గొడవపడ్డారు. అటవీ ప్రాంతంలో ఉన్న మేకల కాపరులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐసీడీఎస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా మహిళతో పాటు శిశువును అక్కడే వదిలి వెళ్లారు సదరు వ్యక్తులు. మహిళతో పాటు శిశువును స్థానిక అంగన్వాడీ కేంద్రానికి తరలించారు ఐసీడీఎస్ అధికారులు. స్థానిక అంగన్వాడీ టీచర్ ఉమర్ సుల్తాన్ బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించగా తల్లి బిడ్డలను సిద్దిపేట బాలల సంరక్షణ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ, చైల్డ్ ప్రొటెక్షన్ బలరాం, చైల్డ్ హెల్ప్ లైన్ కవిత, నర్సు శ్యామల అంగన్వాడీ టీచర్లు మంజుల, సువర్ణ ఉన్నారు.


Similar News