సింగూరుకు మళ్ళీ పెరిగిన వరద..
సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
దిశ, ఆందోల్ : సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, చేరువలో 29.708 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 11,656 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 29.708 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టులోని 11వ గేటును 1.50 మీటర్ల ఎత్తుకు పై కెత్తి దిగువకు 8142 క్యూసెక్కులు జెన్ కో ద్వారా 2823 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11,656 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.
ప్రాజెక్టులో నుంచి మొత్తం 10,965 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువకు నీటిని దిగువకు వదులుతుండడంతో మంజీరా నది పరివాహక ప్రాంత ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపలు పట్టేందుకు జాలర్లు నీళ్లలోకి వెళ్లకూడదని ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు.