బిల్లు రాలేదని వంట గదికి తాళం వేసిన కాంట్రాక్టర్..
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దేగుల్ వాడి ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ మాజీ సర్పంచ్ చంద్రవ్వ రూ.3.40 లక్షలు వెచ్చించి వంట గది నిర్మించారు.
దిశ , కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దేగుల్ వాడి ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ మాజీ సర్పంచ్ చంద్రవ్వ రూ.3.40 లక్షలు వెచ్చించి వంట గది నిర్మించారు. అప్పు చేసి పనులు పూర్తిచేసినా బిల్లులు రాకపోవడంతో ఆవేదనకు గురైన కాంట్రాక్టర్ కుమారుడు గోపాల్ రెడ్డి బుధవారం వంటగదికి తాళం వేశారు. తాళం వేయడంతో 110 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్నం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని పై డీఈవో వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. వంట గదికి తాళం వేసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులు ఆలస్యమైందని వంట గదికి తాళం వేయడం మంచి పద్ధతి కాదని అన్నారు.