పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల ఏర్పాటు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశించారు.
దిశ, ఝరాసంగం : ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల ఏర్పాటు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శరత్ ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఏర్పాటను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, నీటి వసతి, మూత్రశాలలు, వృద్ధుల దివ్యాంగుల కొరకు ర్యాంపులను తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఝరా సంగం రాజేందర్ రెడ్డి, నయాబ్ తహశీల్దార్ యాసిన్ పంచాయతీ కార్యదర్శి స్వప్న, అంగన్వాడీ టీచర్ శకుంతల, ఫీల్డ్ అసిస్టెంట్ వసంత్, తదితరులు పాల్గొన్నారు.