తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ : పొన్నాల లక్ష్మయ్య

సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, పాస్పోర్టు ల దొంగ అని మాజీ టీపీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Update: 2023-03-03 14:48 GMT

దిశ,మద్దూరు : సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, పాస్పోర్టు ల దొంగ అని మాజీ టీపీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర నేపథ్యంలో శుక్రవారం మద్దూరు మండల కేంద్రంతో పాటు లద్నూర్,రేబర్తీ, గాగిళ్ళపూర్,వంగపల్లి గ్రామాల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి తన మాట నిలబెట్టుకున్న తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని గుర్తు చేశారు. దేశం ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు కోసం పునాదులు వేసి ముందుకు సాగడానికి పరిపాలన దక్షతను చూసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. నేడు తెలంగాణ సెంటిమెంట్ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి బ్రిటిష్ వారి పాలనలాగా చిన్న చిన్న ప్రాంతాలుగా మార్చి రాజకీయాలతో అధికారమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు.

     ఒక్క గ్రామంలో కూడా ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, ఇంటికో ఉద్యోగం కానీ ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కో గ్రామానికి 600 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించామని తెలిపారు. ఈపారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసి చర్లపల్లి జైలుకు పంపిస్తామని అన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రం అంటే ఒక కేసీఆర్ కుటుంబం అన్నట్టుగా వ్యవరిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుండగా, రాష్ట్రం అప్పులపాలు అవుతుందని, కేసీఆర్ కుటుంబం మాత్రం అభివృద్ధి చెందుతూ కోట్ల రూపాయలు కూడబెట్టు కుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News