వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలిని రాష్ట్ర మైనారిటీ సంఘం నాయకులు జుబేర్ పాషా, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అర్జున్ గౌడ్ అన్నారు.

Update: 2023-03-24 12:38 GMT

రాష్ట్ర మైనారిటీ సంఘం నాయకుడు జుబేర్ పాషా

దిశ, ములుగు: వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలిని రాష్ట్ర మైనారిటీ సంఘం నాయకులు జుబేర్ పాషా, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అర్జున్ గౌడ్ అన్నారు. శుక్రవారం ములుగు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండల పరిధిలోని 36 గ్రామ సంఘాల్లోని 700 గ్రూపులకు గాను రూ.1.31కోట్ల రూపాయల పావలా వడ్డి రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలను మహిళలు అన్ని రకాలుగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శైలజ, డ్వాక్రా సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News