ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వండి..
కురుమ సంఘం అధ్యక్షుడు ఎంఎల్సీ ఎగ్గే మల్లేశంను తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ సోమవారం కలిసి ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: కురుమ సంఘం అధ్యక్షుడు ఎంఎల్సీ ఎగ్గే మల్లేశంను తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ సోమవారం కలిసి ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీరయ్య యాదవ్ మాట్లాడుతూ కురుమ ఉమ్మడి మెదక్ జిల్లాలో గొల్ల కురుమల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం డోల్ దెబ్బ బహిరంగ సభలు నిర్వహించి, గొర్రెల పెంపకం దారుల సంఘాలను స్థాపించుటకు తాను ఎనలేని కృషి చేశానని అన్నారు. మండల్ కమిషన్ బీసీ రిజర్వేషన్‌ల కోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 2001 నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో కేసులు అనుభవించిన సందర్భంగా జిల్లాలో మంచి బీసీ నేతగా గుర్తింపు ఉండడంతో కురుమ సంఘం అధ్యక్షులు ఎంఎల్సీ ఎగ్గే మల్లేశంను తన నివాసంలో కలిసి మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశామని అన్నారు.
ఎగ్గే మల్లేశం సానుకూలంగా స్పందించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జిల్లా మాజీ మంత్రి హరీష్ రావులకు మెదక్ సీటు కేటాయించాలని కోరుతానని కురుమ సంఘం సంపూర్ణ మద్దతుగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. సానుకూలంగా స్పందించి మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు పుష్ప నాగేష్, గంగా నర్సరీ ఎండీఐసీ మోహన్, జీహెచ్‌ఎంసీ కురుమ సంఘం కార్యదర్శి బండ జోగిందర్, కామారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు భూమన్న, ధనసిరి ప్రకాష్, కిష్టన్న పాల్గొన్నారు.