ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్
ఇందిరమ్మ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని చిన్న ఘనపూర్ లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కలెక్టర్ రాహుల్ రాజ్
దిశ, కొల్చారం: ఇందిరమ్మ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని చిన్న ఘనపూర్ లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంపీడీవో కృష్ణవేణి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో కొల్చారం మండలం వెనుకబడి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలం లో అన్ని గ్రామాలలో సిగ్నల్ సమస్య లేకున్నా సర్వేలో వెనుకబడడానికి కారణమేమిటని ఎంపీడీవోను ప్రశ్నించారు. చిన్న ఘనపూర్ లో పంచాయతీ కార్యదర్శి ఉన్నాడా లేడా ఉంటే ఏం చేస్తున్నాడు అంటూ ఎంపీడీవోను ప్రశ్నించారు. గ్రామంలో ఏ వీధి చూసిన చెత్తాచెదారంతో నిండిపోయిందని పంచాయతీ కార్యదర్శి ఎం చేస్తున్నాడు అని ప్రశ్నించారు. కుంటి సాకులు చెప్పకుండా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎంపీడీవోను ఆదేశించారు. ప్రతి ఒక్క సర్వేయర్ రోజుకు కనీసం 50 ఇండ్లు సర్వేజరిపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపిడిఓ ఆదేశించారు.