strange trend : విద్యాశాఖ వింత పోకడ
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత డిప్యూటేషన్లపై వచ్చిన ఉత్తర్వులపై విమర్శలు రావడంతో విద్యాశాఖ (Department of Education)వెనక్కి తగ్గింది.
దిశ,మేడ్చల్ బ్యూరో : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత డిప్యూటేషన్లపై వచ్చిన ఉత్తర్వులపై విమర్శలు రావడంతో విద్యాశాఖ (Department of Education)వెనక్కి తగ్గింది. కానీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మాత్రం డిప్యూటేషన్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. డిప్యూటేషన్లు లేవంటూనే గత నెలలో 11 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లా పరిధిలో ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. విద్యాశాఖ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
ఉత్తర్వులు రద్దయినా..
రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో దాదాపు 30 వేల మందికి (30 thousand people)ప్రమోషన్లు, 40 వేల మందికి బదిలీలు జరిగాయి. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇచ్చి వారు కోరుకున్న ప్రాంతానికి పంపించారు. అందులో సరైన స్థానాలు దక్కని కొందరు టీచర్లు సర్కారు పెద్దల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి డిప్యూటేషన్లు, ఓడీలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. కాగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన కొద్ది రోజులకే డిప్యూటేషన్ల ఉత్తర్వులు రావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీనిపై సర్కారు పెద్దలకు టీచర్ల సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఏదో ఒక కారణం చెప్పి బదిలీలకు అవకాశమిస్తే చదువు చెప్పేదెవరనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. డిప్యూటేషన్లు ,ఆన్ డ్యూటీ (For deputations, on duty)లకు అవకాశం ఇచ్చినట్లయితే జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లే ఉండరని, దీంతో సర్కారుకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో సర్కార్ పెద్దల ఆదేశంతో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఇచ్చిన ఉత్తర్వులను అభయన్స్ లో పెట్టారు. కానీ మేడ్చల్ జిల్లాలో మాత్రం ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల పరంపర కొనసాగుతోంది.
జోరుగా దందా..
విద్యాశాఖలో వింత పోకడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు, ఆన్ డ్యూటీ ల ఉత్తర్వులను నిలిపివేసినప్పటికీ మరోవైపు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 11 మంది టీచర్లు తమకున్న పలుకుబడితో పాఠశాల విద్యాశాఖ సంచాలక కార్యాలయం నుంచి నేరుగా డిప్యూటేషన్ ఉత్తర్వులు తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు వెంటనే సదరు టీచర్లను రిలీవ్ చేయాలని ఆయా జిల్లాల డీఈఓలపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక పలువురు జిల్లాల విద్యాశాఖ అధికారులు సదరు టీచర్లకు రిలీవ్ అర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
డిప్యూటేషన్ల పరంపర..
అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో పనిచేస్తున్నఓ టీచరు భర్త హైదరాబాద్ లో పనిచేస్తుండగా భార్యను తనవద్దకు రప్పించేందుకు ఏకంగా రాష్ట్రస్థాయిలో ఫైరవీ చేసి మేడ్చల్ జిల్లాకు ఇటీవల డిప్యూటేషన్ ఇప్పించుకున్నారు. ఇదే తరహాలో గత నెల 5వ తేదీన 10 మంది టీచర్లకు డిప్యూటేషన్లు, ఆన్ డ్యూటీల కింద మేడ్చల్ జిల్లాలో పనిచేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీపల్లి, జగ్గంగూడలో ఎస్జీటీ టీచర్ గా పనిచేస్తున్న టి. విజయలక్ష్మికి నాగోల్ కు ఆన్ డ్యూటీ ఉత్తర్వులు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో పనిచేస్తున్న డి.చంద్రకళకు ఉప్పల్ మండలంలో డిప్యూటేషన్ ఇచ్చారు.
వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సి.హెచ్. ఆనురాధ, బుర్ర సురేఖలకు, ములుగు జిల్లాలో పనిచేస్తున్న జి.జెరుషా రాణి, నారాయణ పేట జిల్లాలో పనిచేస్తున్న జి.ప్రతిభకు ,మేడ్చల్ జిల్లాలోనే సురారం జిల్లా పరిషత్ హైస్కూల్ లో కె.కవితను మూసాపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలకు డిప్యూటేషన్లు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 31 జీఓ (31 Geo) కింద ఏడాదిగా కుటుంబాలకు దూరంగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేదన ఆరణ్య రోధనగా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి.