వనదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గా మాతను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దర్శించుకున్నారు.

Update: 2024-09-28 14:45 GMT

దిశ, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గా మాతను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వన దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, ఆలయ సిబ్బంది ఉన్నారు.


Similar News