Commissioner : రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్ పోటీలు

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్‌లకు ఫోటోగ్రఫీ,

Update: 2024-10-13 11:24 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్‌లకు ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫర్లకు షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. పోలీస్ అమర వీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలు, సైబర్ నేరాలు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, మత్తు పదార్థాల సేవనం, వాటి అనర్ధాలు పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా 2023 అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ మధ్యలో తీసిన (3) ఫోటోలు, తక్కువ (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి ఈనెల 20వ తేదీ లోపు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పీఆర్ఓ కు అందజేయాలన్నారు. జిల్లాస్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిమ్స్ ను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.


Similar News